రైతుల సంక్షేమానికి పెద్దపీట

 అగ్రిటెక్‌ సదస్సులో మంత్రి కన్నబాబు

గుంటూరు,డిసెంబర్‌17(జనంసాక్షి):  రైతులను గాలికొదిలేసే ప్రభుత్వం తమది కాదని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్న ఘనత సిఎం జగన్‌దని అన్నారు. శుక్రవారం ఎన్జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్శిటీలో జరిగిన అగ్రిటెక్‌ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ క్రాప్‌ ద్వారా నల్ల తామర పురుగుతో దెబ్బతిన్న మిర్చి పంటపై నివేదిక తెప్పిస్తున్నామన్నారు. వ్యవసాయ, ఉద్యానశాఖ వీసీలతో పాటు సైంటిస్టులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నల్ల తామర పురుగు బారిన పడిన మిర్చి పంటను ఎలా కాపాడుకోవాలనే దానిపై దృష్టిపెట్టామన్నారు. వ్యవసాయంలో సాంకేతికతను రైతులు అందిపుచ్చుకోవాలని మంత్రి కన్నబాబు తెలిపారు.