జయశంకర్ భూపాలపల్లి,డిసెంబర్6 (జనంసాక్షి ) : జిల్లాలో కాటారం మండల కేంద్రంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు సుమారు రెండు లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ సీఐ మోహన్ ఆధ్వర్యంలో సోమవారం పలు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మండల కేంద్రంలోని చింతకాని క్రాస్ వద్ద సోమేశ్వర కిరాణంలో పెద్ద ఎత్తున గుట్కాలు పట్టుబడ్డాయి.గుట్కాలను స్వాధీనం చేసుకొని నిందితులు అల్లాడి ప్రవీణ్ కుమార్, రాచర్ల సత్యంపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ ఏఎస్‌ఐ అమరేందర్ రెడ్డి, పీసీ రాజు, తదితరులు ఉన్నారు.
కాటారంలో గుట్కా ప్యాకెట్ల స్వాధీనం