గిరిజనుల పెన్షన్‌ పునరుద్దరించాలి: లోకేశ్‌ లేఖ

అమరావతి,డిసెంబర్‌10 జనంసాక్షి:  సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ లేఖ రాశారు. గిరిజనులకు పథకాలు దూరం చేసే అడ్డగోలు నింబధనలు తొలగించాలని లేఖలో పేర్కొన్నారు. గిరిజనులకు నిలిపివేసిన పెన్షన్‌, రేషన్‌ను పునుద్దరించాలని కోరారు. 10 ఎకరాల భూమి, వాహనం ఉంటే సంక్షేమ పథకాలు నిలిపివేస్తున్నారని లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తెచ్చిన ఈ నిబంధనలు ఆదివాసీల పాలిట శాపం మారాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో చాలా మంది ఏడాది ఆదాయం 25 వేలు కూడా ఉండదన్నారు. అలాంటి వారికి నిబంధనల పేరుతో పథకాలను దూరం చేస్తున్నారన్నారు. 300 యూనిట్ల విద్యుత్‌ వాడకం దాటితే గిరిజనుల పెన్షన్లు, పథకాలు కట్‌ చేస్తున్నారన్నారు.