సిఎం కెసిఆª` జనగామ సభ ఏర్పాట్ల పరిశీలన

 


పర్యటనను విజయవంతం చేసేలా మంత్రలు కృషి
ఏర్పాట్లు పరిశీలించి..దిశా నిర్దేశం చేసిన మంత్రులు
హైదరాబాద్‌,డిసెబర్‌17(జనంసాక్షి):  ఈ నెల 20న జనగామలో జరిగే సీఎం కేసీఆర్‌ బహిరంగ సభకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభను విజయవంతం చేయడానికి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమన్వయంతో చేస్తున్నామని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. సీఎం బహిరంగ సభ ఏర్పాట్ల సన్నాహక సమావేశాలు జనగామ జిల్లాలో జరిగాయి. పాలకుర్తి, కొడకండ్ల మండలాల ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం పాలకుర్తి క్యాంప్‌ కార్యాలయంలో, దేవరుప్పుల మండల సమావేశం అదే మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్స్‌ లో శుక్రవారం జరిగాయి. ఈ సమావేశాల్లో పార్టీ పరిశీలకులు, వివిధ విభాగాల ఇంచార్జీలు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌, వరంగల్‌ టఞఞశి చైర్మన్‌ మార్నేని రవీందర్‌ రావు, మెట్టు శ్రీనివాస్‌, భరత్‌ కుమార్‌ రెడ్డి, జన్ను జకార్య, స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..జనగామ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా బహిరంగ సభ లో సీఎం మాట్లాడతారని, తెలంగాణలో అమలు అవుతున్న, అభివృద్ధి, సంక్షేమాలను సీఎం ప్రజలకు వివరిస్తారని పేర్కొన్నారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ..ఎర్రబెల్లి దయాకర్‌ రావు గారు పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో, అన్ని విధాలుగా అద్భుతమైన అభివృద్ధి చేస్తున్నారని అభినందించారు. దేశంలో ఎక్కడా లేనన్ని పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయి. సభను విజయవంతం చేయాలని కోరారు. ఇదిలావుంటే జనగామ నూతన కలెక్టరేట్‌ కార్యాలయాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ సత్యవతి రాథోడ్‌ శుక్రవారం పరిశీలించారు. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్‌ జనగామ జిల్లాలో పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. అలాగే జిల్లా నూతన కలెక్టర్‌ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌
కార్యాలయాన్ని, ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించి మంత్రి మాట్లాడారు. ఒకప్పుడు జనగామ అంటే ఎడారి ప్రాంతం. కనీసం తాగడానికి నీళ్లు దొరికేవి కాదన్నారు. కానీ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఈరోజు రెండు పంటలకు సమృద్ధిగా నీరు లభిస్తుందన్నారు. సవిూకృత కలెక్టర్‌ కార్యాలయం వల్ల అధికారులు అంతా ఒకేచోట ఉండి ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం సులువు అవుతుందన్నారు. కలెక్టర్‌ కార్యాలయం ప్రారంభం తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభం చేస్తారు. ఆనంతరం బహిరంగ సభ ఉంటుందని మంత్రి తెలిపారు. సీఎం సభను విజయవంతం చేయడానికి మంత్రులం, స్థానిక నాయకత్వం అంతా కలిసి కట్టుగా విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీలు పసునూరి దయాకర్‌, మాలోతు కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస రెడ్డి, బండ ప్రకాష్‌, ఎమ్మేల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, నన్నపనేని నరేందర్‌, మాజీ ఎమ్మెల్సీ బోడేకుంటి వెంకటేశ్వర్లు, చైర్మన్లు పాగాల సంపత్‌ రెడ్డి, వాసుదేవ రెడ్డి, మర్రి యాదవరెడ్డి, నాగుర్ల వెంకన్న, మార్నేని రవీందర్‌ రావు, గాంధీ నాయక్‌, ఎడవెల్లి కృష్ణా రెడ్డి, రాజేశ్వర్‌ రెడ్డి, సంపత్‌, సత్యమూర్తి, ఉపేందర్‌, ఇతర నాయకులు ఉన్నారు.