పెద్దమనసు చాటుకున్న తానా

ఆస్పత్రులకు 25కోట్ల వస్తువుల వితరణ

విశాఖపట్టణం,డిసెంబర్‌21(జనం సాక్షి ): ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా పెద్ద మనస్సు చాటుకుంది. తెలుగు రాష్టాల్ల్రోని ఆస్పత్రులకు తానా నుంచి 25 కోట్ల రూపాయల విలువైన మందులు, వైద్య పరికరాలు అందిస్తోంది. ఈ విషయాన్ని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తానా అధ్యక్షుడు లావు
అంజయ్య చౌదరి వెల్లడిరచారు. ప్రస్తుతం ఓడల్లో ఉన్న మెడికల్‌ సామగ్రి ఈనెల 27న విశాఖపట్నం చేరుకుంటాయని తెలిపారు. చికాగోకు చెందిన నార్త్‌ వెస్టన్ర్‌ మెమోరియల్‌ హెల్త్‌ కేర్‌ ఈ పరికరాలను అందజేసినట్లు తెలిపారు. తానా రెడ్‌క్రాస్‌తో కలిసి తెలుగు రాష్టాల్ర ప్రభుత్వాలకు పరికరాలను అందజేయడానికి ప్రణాళిక వేసింది, పరికరాలు అవసరమైన ఆసుపత్రులను రెడ్‌క్రాస్‌ గుర్తిస్తోందని‘ చౌదరి చెప్పారు. గత 46 ఏళ్లుగా కుల, మత, ప్రాంతాలకు అతీతంతంగా ఆంధప్రదేశ్‌, తెలంగాణలో తానా సేవా కార్యక్రమాలు చేస్తుందని వివరించారు. ఈ ఏడాది రద్దయిన తానా మహాసభలు 2023లో నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. తానా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విశాఖపట్నంలో తన తొలి పర్యటనకు వచ్చిన అంజయ్య చౌదరి అసోసియేషన్‌లో 40,000 మంది జీవితకాల సభ్యులున్నారని తెలిపారు. ‘తానా యొక్క టీమ్‌ స్క్వేర్‌ చొరవతో 40,000 మందికి గుండె శస్త్రచికిత్సలు, 4,000 పాఠశాలల్లో డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. గ్రేస్‌ ఫౌండేషన్‌, బసవతారకం ఇండో`అమెరికన్‌ హాస్పిటల్‌తో కలిసి రెండు తెలుగు రాష్టాల్లోన్రి గ్రావిూణ ప్రాంతాల్లో 150 క్యాన్సర్‌ శిబిరాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడిరచారు.