ధాన్యం సేకరణలో చేతులెత్తేసిన కేంద్రం


రైతులు ప్రత్యమ్నాయ పంటలు వేస్తున్నారు

ఎమ్మెల్సీ ఎన్నికలతో ప్రజల్లో కెసిఆర్‌ పట్ల పెరిగిన విశ్వాసం
రేవంత్‌ను ప్రజలే బహిష్కరిస్తారన్న గుత్తా సుఖేందర్‌
నల్లగొండ,డిసెంబర్‌17(జనంసాక్షి): ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయడంతో తెలంగాణలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునే పరిస్థితి వచ్చిందని శాసన మండలి మాజీ చైర్మన్‌, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి విమర్శించారు. ధాన్యం సేకరణపై ఇప్పటికీ కేంద్రం తగిన సమాధానం ఇవ్వడం లేదన్నారు. తెలంగాణలో అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి అయితే అభినందించి కొనాల్సింది పోయి కొర్రీలు పెడుతోందన్నారు. శుక్రవారం నల్లగొండ లోని తన నివాసంలో నల్లగొండ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బండ నరేందర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు యమా దయాకర్‌ లతో కలిసి ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో మాట్లాడారు. జాతీయ బ్యాంక్‌లను, ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌ పరం చేస్తూ మోడీ అన్ని ప్రసంగాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. జాతీయ బ్యాంకులన్నీ 16 లక్షల కోట్ల లాభాలతో విజయవంతంగా ముందుకు సాగుతున్న తరుణంలో బ్యాంక్‌ లను అమ్మడం బిజెపి ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమని అభివర్ణించారు. దుర్మార్గపు విధానాలతో బిజెపి దేశాన్ని అంబానీలకు, ఆదానిలకు అమ్ముతోందని, పబ్లిక్‌ రంగ సంస్థలను అమ్మే విధానాలను బిజెపి ప్రభుత్వం విడనాడాలని హితవు పలికారు. ప్రజలపై భారం వేస్తూ పేదరికాన్ని పెంచుతున్న కేంద్రం తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. కేంద్రం చేతులెత్తేయడంతో తెలంగాణలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. బ్యాంకులను, ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌ పరం చేస్తూ ప్రధాని మోదీ అన్ని సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌ రెడ్డితో కలిసి నల్లగొండలోని తన నివాసంలో విూడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే విధానాలను బీజేపీ ప్రభుత్వం విడనాడాలని సూచించారు. ప్రజలపై భారంమోపుతూ పేదరికాన్ని పెంచుతున్న కేంద్రం తీరు బాధాకరమన్నారు. మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరిం చారు. రూ.16 లక్షల కోట్ల లాభాల్లో వున్న బ్యాంకులను అమ్మడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, దుర్మార్గపు విధానాలతో దేశాన్ని అంబానీలకు, ఆదానిలకు అమ్ముతున్నాదని దుయ్యబట్టారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మాటలు వింటుంటే నవ్వు వస్తున్నదని ఎద్దేవా చేశారు. నేల విడిచి సాము చేస్తున్న రేవంత్‌కు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. దిగజారి రాజకీయాలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడికి ప్రజలు బహిష్కరించే రోజు త్వరలోనే వస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోరాడి సాధించుకున్న రాష్టాన్న్రి సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణగా మారుస్తున్నారని, ఆయనపై అడ్డగోలిగా మాట్లాడడం తగదన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తిరులేని విజయం సాధించిందని, దీనిద్వారా సీఎం కేసీఆర్‌పై ప్రజలు, ప్రజాప్రతినిధుల్లో ఉన్న విశ్వాసం మరోసారి రుజువైందని చెప్పారు. నల్లగొండలో కోటిరెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. దిగజారి రాజకీయాలు చేస్తున్న రేవంత్‌ ను ప్రజలు బహిష్కరించే రోజు త్వరలోనే వస్తాయని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ కుటుంబం టార్గెట్‌ గా నోటికొచ్చినట్లు అడ్డగోలుగా, వ్యక్తిగత విమర్శలు చేస్తున్న రేవంత్‌ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో 12 స్థానాల ఎన్నికల్లో కెల్లా తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు తిరుగులేని విజయం సాధించడం ప్రజల్లో టిఆర్‌ఎస్‌కు, కెసిఆర్‌కు అమితమైన అభిమానం స్పష్టమవుతుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ పై ప్రజల్లో, ప్రజాప్రతినిధుల్లో ఉన్న విశ్వాసం, నమ్మకం మరో సారి రుజువైందని వివరించారు.