సిద్దిపేటలో ఓటేసిన మంత్రి హరీష్‌ రావు



ఆయనతో పాటే ఓటేసిన మెదక్‌ ఎంపి

 సిద్దిపేట,డిసెంబర్‌ 10 జనంసాక్షి:  స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి హరీశ్‌ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటిసారిగా ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎక్స్‌అఫీషియో హోదాలో ఓటు హక్కు కల్పించారని చెప్పారు. ప్రజాప్రతినిథులు మాత్రమే ఓటర్లు కావడంతో 99 శాతం ఓట్లు నమోదవుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కు వినియోగించుకుంటారని అన్నారు. మంత్రితోపాటు మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి ఓట వేశారు. కాగా, ఉమ్మడి మెదక్‌లో మధ్యాహ్నం 12 గంటల వరకు 42.1 శాతం పోలింగ్‌ నమోదయింది.