వృద్దుడిని ఢీకొన్న ఎమ్మెల్సీ ఇక్బాల్‌ వాహనం

అనంతపురం,డిసెంబర్‌31 (జనంసాక్షి): రోడ్డు దాటుతుండగా ఎంఎల్‌సి కారు వృద్ధుడిని ఢీకొనడంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం లేపాక్షిలో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఎంఎల్‌సి మహమ్మద్‌ ఇక్బాల్‌ కారులోనే ఉన్నారు. వెంటనే వృద్ధుడిని ఆసుపత్రికి తరలించారు. వృద్ధుడిని తాలూకు బంధువులకు రూ.50 వేలను ఇచ్చి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. అవసరమయితే బెంగళూరుకు సైతం తీసుకువెళ్లి తగు పరీక్షలు చేయించాలని చెప్పారు. అయితే వృద్ధుడిని ఢీకొన్నప్పటికీ డ్రైవర్‌ వాహనాన్ని ఆపకుండా ముందుకు వెళ్లిపోయాడు. దీంతో స్థానికులు ఎమ్మెల్సీ ఇక్బాల్‌ వాహనాన్ని చుట్టుముట్టారు. తీవ్రంగా గాయపడిన వృద్ధుడు మల్లయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్సీ వాహనం హిందూపురం నుంచి బెంగళూరు వైపు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.