మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం


వేల్పూరులో ఐసియూ విభాగం ప్రారంభించిన మంత్రి వేముల

నిజామాబాద్‌,బిసెంబర్‌10(జనం సాక్షి): రాష్ట్రంలోని పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు`భవనాలు,గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం తన మిత్రుల సహకారంతో సుమారు రూ. 31 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 8 ఐసీయూ, 6 ఆక్సిజన్‌ బెడ్స్‌ను మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ప్రారంభించారు.  సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ నాయకత్వంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ప్రధాన ఆస్పత్రుల్లో ఐసీయూ బెడ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. తన మిత్రుల సహకారంతో రూ. 1.5కోట్ల వ్యయంతో బాల్కొండ నియోజకవర్గ ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నామని పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని 12 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసీయూ, ఆక్సిజన్‌ బెడ్స్‌, ఆపరేషన్‌ థియేటర్‌, వాటర్‌ ఆర్వో ఎª`లాంటు అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడిరచారు. తన సతీమణి నీరజారెడ్డి కూడా రూ. 25 లక్షలు ఆస్పత్రి అభివృద్ధి కోసం ఇచ్చిందని చెప్పారు. ఇటీవల ఒక మిత్రుడు రూ. 27లక్షల విలువ గల ఆక్సిజన్‌ అంబులెన్స్‌ విరాళంగా ఇచ్చాడని, అది మోర్తాడ్‌ కేంద్రంగా నియోజకవర్గం అంతా వినియోగంలోకి వచ్చిందని మంత్రి తెలిపారు.