కేంద్రం తీరును ఎండగట్టాల్సింది వారే
రైతుబంధు,రైతు బీమాతో తిరుగులేని అభిమానం
గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండ,డిసెంబర్7 (జనంసాక్షి) : రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆరే అండతో తెలంగాణ రైతాంగం సుభిక్షంగా ఉందని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా 24 గంటల కరెంట్‌పై ప్రధానంగా చర్చించుకుంటున్నారని, తరవాత రైతుబంధు, రైతుబీమాపై చర్చ చేస్తున్నారని అన్నారు. కేంద్రం ఇలాంటి పథకాలను ఎక్కడైనా అమలుచేసి చూడాలన్నారు. బిజెపి నేతలు విమర్శలు మాని ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. కేంద్రం తీరు మారకుంటే ప్రజలు గట్టిగా సమాధానం చెప్పరోజు వస్తుందని అన్నారు. అలాగే బిజెపి నేతలు ప్రగల్భాలు ఆపి ధాన్యం ఎందుకు కొనగడం లేదని కేంద్రాన్ని నిలదీయాలన్నారు. తెలంగాణ సిఎం కెసిఆర్‌పై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని దెబ్బతీయడం లక్ష్యంగా బిజెపి ఆరోపణలుచేస్తోందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్టాన్న్రి నెంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు. తెలంగాణ వస్తే కరెంటు ఉండదని.. చీకట్లు తప్పవని నాటి పాలకులు హెచ్చరికలు చేశారన్నారు. కానీ నేడు కోతలు లేని కరెంటును నిరంతరంగా సరఫరా చేస్తున్నామన్నారు. వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణెళి అన్నారు. రైతు బంధు, రైతుబీమా పథకాలను కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్టాల్రలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మహిళలు, వృద్ధులు, యువకులు తెలంగాణ పథకాలపై చర్చ చేయడంతో పాటు వారే ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఏడున్నర సంవత్సరాల్లో జరిగిన ప్రగతిని గుర్తించి ప్రజలు ఆదరిస్తున్నారని వివరించారు. సీఎం కేసీఆర్‌పై ప్రజలకు ఎంత అభిమానం ఉందో క్షేత్రస్థాయిలో ఉన్నవారికే తెలుసునని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన హావిూలను తప్పకుండా అమలు చేస్తారన్న విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు. ఏ ముఖ్యమంత్రి ప్రజల గురించి ఇంతలా ఆలోచించలేదని, కాంగ్రెస్, టీడీపీ నాయకులు అధికారంలో ఉన్నపుడు ప్రజలను మోసం చేశారన్నారు. మరోసారి మాయమాటలు చెబుతూ మభ్య పెట్టేందుకు ముందుకు వస్తున్నారని, ప్రజలంతా ఆలోచించాలన్నారు. ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్ వారి సంక్షేమం కోసం నిరంతరాయంగా తపిస్తున్నారని అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పేద కుటుంబాలు సంతోషంగా తమ ఆడబిడ్డల పెళ్లి చేస్తున్నారన్నారు. ఇన్ని మంచి పథకాలను తీసుకుని వచ్చిన కేసీఆర్ నాయకత్వాన్ని అప్రతిష్ట పాలుచేసేందుకు కేంద్రం ధాన్యం కొనుగోళ్లలో కొర్రీలు పెడుతోందని అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాకనే పింఛన్ రూ.2016కు పెరిగిందని చెప్పారు. రైతు బంధు కింద ఆర్థిక సాయం రూ.ఎకరాకు 10వేలకు పెరుగుతుందని రైతులు సంబర పడుతున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలకు ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారన్నారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్న విపక్షాలకు నైతికత లేదన్నారు.`