ధాన్యం కొనుగోళ్లకు ఎదురుచూపులు

  అధికారుల తీరుపై మండిపడుతున్న రైతులు

ఏలూరు,డిసెంబర్‌3 (జనంసాక్షి) : ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు సమయం దాటి డిసెంబర్‌ వచ్చినా కొనుగోళ్ల ఊసే లేకపోవటంపై రైతులు మండిపడుతున్నారు. దీనికితోడు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యాన్ని ఆర్‌బీకేల్లో అమ్ముకోవాలంటే ఈ`క్రాప్‌లో పంట వివరాలను నమోదు చేయించు కోవాల్సిందేనే షరతును ప్రభుత్వం పెట్టింది. అయితే ఆర్‌బీకేల్లో గత నెల నుంచి నమోదుకోసం వెళుతున్న రైతులకు సర్వర్‌ సమస్య ఉందని చెప్పి తిప్పి పంపుతున్నారు. అయితే అధికారులు మాత్రం చాలాచోట్ల నూరు శాతం ఈ`క్రాప్‌ నమోదు జరిగిపోయిందని చెబుతుంటే, మరికొన్ని చోట్ల ఇంకా కేవలం 20 శాతం మాత్రమే చెయ్యాల్సి ఉందని చెబుతున్నారు. అయితే రైతు సంఘాల నేతలు మాత్రం ఇంకా 50 శాతం కూడా పూర్తికాలేదని, దీనివల్ల ప్రస్తుతం వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులు చాలావరకు నష్టపోవలసి వస్తుందని, కేవలం ఇదంతా రైతులను మోసగించే కుట్ర మాత్రమేనంటూ మాజీ మంత్రి ఆలపాటి రాజేందప్రసాద్‌ తీవ్ర ఆరోపణలకు దిగుతున్నారు. ఈ`క్రాప్‌ నమోదే కాకుండా తర్వాత గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా సి.ఎం యాప్‌లో నమోదు కూడా తప్పనిసరే నంటున్నారు. ఇవన్నీ తెలియని రైతులు ప్రభుత్వం గొప్పగా ప్రకటించామని చెబుతున్న ఆ మాత్రం గిట్టుబాటు ధరకు కూడా నోచుకోలేని పరిస్థితి ఉంది. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని చెప్పటం మినహా దానికి అవసరమైన పరికరాలు, గోతాల వంటివాటిపై ఊసేలేదు. మార్కెటింగ్‌ శాఖ, జి.డి.ఎం.ఎస్‌ల వంటివి ముందుకే రాలేదు. అయితే ఆర్‌.బి.కె లనే కొనుగోలు కేంద్రాలుగా ప్రభుత్వం ప్రకటించామని చెబుతుంటే, ఆ కేంద్రాల దగ్గరకు వెళ్లిన వారికి సమాధానమే దొరకటంలేదు. రైతులు ఎవ్వరూ కొనుగోలు కేంద్రాల దగ్గరకు రావద్దని, మే మే రైతుల దగ్గరకు, వారి ఇళ్లకు వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రవాణా భారాన్ని కూడా వారిపై మోపబోమని వ్యవసాయ మంత్రి ప్రకటిస్తే, వచ్చి కొనటం అటుంచి రైతులే వెళ్లి అడి గి నా కొనుగోళ్లు చేయని పరిస్థితి. దీంతో రైతులు చాలామంది వరి కోతల  కోసేందుకు వెనకాడుతున్నారు.