హైదరాబాద్,డిసెంబర్ 10 జనంసాక్షి: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనుమరాలు నిహారిక`రవితేజల వివాహం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని నోవాటెల్ ఎరీనాలో గురువారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, ఈనాడు ఎండీ రామోజీరావు, తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్‌రెడ్డి తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
వైభవంగా వెంకయ్య మనవరాలు వివాహం