గంజాయి అక్రమ రావాణపై దృష్టి

  

కఠినచర్యలకు దిగిన పోలీసులు

విశాఖపట్టణం,డిసెబర్‌11 (జనంసాక్షి)  జిల్లాలో గంజాయి రవాణా అరికట్టడంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు జిల్లా పోలీస్‌ అధికారులు తెలిపారు. ఏజెన్సీలో గంజాయి ఎక్కడెక్కడ పండిస్తున్నారు.. ఎవరికి సరఫరా చేస్తున్నారన్నదానిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారన్నది ఆరా తీస్తున్నామని అన్నారు. జాతీయ రహదారిలో ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించిన ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నామని పేర్కొన్నారు. డీఎస్పీ స్థాయి అధికారితో రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మావోయిస్టుల ప్రభావం తగ్గిపోవడంతో వారి ఉనికి చాటుకోడానికి కొన్ని ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో నేరాల సంఖ్య తగ్గిందన్నారు. అయితే కొత్తతరహా ఆర్థిక నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని వివరించారు. వీటి పట్ల ప్రజలు అప్రత్తంగా ఉంచేలా పోలీసులతో ప్రచారం చేయిస్తున్నామని తెలిపారు. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

 `````