సిఎస్‌ సోమేశ్‌తో కేంద్ర కార్యదర్శి భేటీ


హైదరాబాద్‌,డిసెంబర్‌10(జనం సాక్షి):  కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ కార్యదర్శి బరుణ్‌ మిత్ర శుక్రవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ఆయనను సాదరంగా ఆహ్వానించారు. బిఆర్కె భవన్‌ లో జరిగిన సమావేశంలో ఇరువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో న్యాయపరమైన వివిధ సంస్కరణలను సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ఆయనకు వివరించారు. అలాగే న్యాయశాఖ లో కేంద్రం తీసుకు వస్తున్న వివిధ రకాల సంస్కరణలను కూడా బరుణ్‌ మిత్ర వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ రకాల సంస్కరణలను తెలుసుకున్న బరుణ్‌ మిత్ర ప్రశంసించారు.