కాంగ్రెస్‌లో సభ్యులుగా చేరితే రూ.2లక్షల బీమా


` రేవంత్‌రెడ్డి బంపర్‌ ఆఫర్‌

హైదరాబాద్‌,జనవరి 12(జనంసాక్షి):కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకున్న సభ్యులకు జీవితబీమా కల్పించ నున్నట్లు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తెలిపారు. బూత్‌ లెవల్లో డిజిటల్‌ సభ్యత్వం చేపడతామని అన్నారు. దీని కోసం న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో మాట్లాడిన రేవంత్‌..సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ప్రమాదంలో మరణిస్తే 2 లక్షల రూపాయల పరిహారం అందుతుందన్నారు. ప్రమాదంలో ఏదైనా శరీర అవయవాలు దెబ్బతింటే ప్రమాద తీవ్రతను బట్టి పరిహారం అందుతుందని చెప్పారు. కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకునన్న సభ్యులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ న్యూ ఇండియా అస్యూరెన్సు కంపెనీ తో ఒప్పందం చేసుకున్నట్లు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, పీఏసీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ హాజరయ్యారు. 30 లక్షల సభ్యత్వం లక్ష్యం పూర్తిచేసి తీరతాం అన్నారు. తొలుత జనవరి 26 వరకు అనుకున్నాం. కరోనా వల్ల మరికొంత గడువు కూడా పెంచుకున్నాం. ఇప్పటి వరకు 7 లక్షల సభ్యత్వాలు పూర్తయ్యాయి. మార్చి వరకు సభ్యత్వంకి గడువు ఉంది. ప్రతి బూత్‌ నుండి 100 మంది సభ్యత్వం నమోదు చేయాలి. సభ్యత్వం తీసుకున్నవారికి 2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది.మండల స్థాయిలో 10 వేలు, అసెంబ్లీ స్థాయిలో 50 వేలు.. పార్లమెంట్‌ స్థాయిలో మూడున్నర లక్షల సభ్యత్వం చేయించినవారికి రాహుల్‌తో సన్మానం చేయిస్తామని రేవంత్‌ అన్నారు.