కొత్తజిల్లాల అభ్యంతరాలకు 30రోజుల గడువు

  

పలు మార్పులతో తాజాగా నోటిఫికేషన్‌

హిందూపురం బదులు పుట్టపర్తికే మొగ్గు

అమరావతి,జనవరి27(జనం సాక్షి):  కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలనా వికేంద్రీకరణ జరుగుతందని తెలంగణ ప్రభుత్వం నిరూపించింది. నిజానికి ఎపి విడివడ్డ తరవాత జిల్లాలను విభజించాలన్న డిమాండ్‌ ఉన్నా చంద్రబాబుపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. హైకోర్టును తరలించడానికి కూడా నానా తంటాలు పడ్డారు. ఎపికి మౌళిక వసతులు కల్పించకుండా సమస్యలను నాన్చారు. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం మూడేళ్లకు కానీ కదలలేదు. జిల్లాల విభజనతో పాలనలో పారదర్శకతతో పాటు, వేగం పెరగగలదు. ఇప్పటికే కేబినెట్‌లో ప్రవేశపెట్టిన మెమోరాండంలో స్వల్ప మార్పులు చేస్తూ  ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ ను జారీ చేసింది. 26 జిల్లాలకు సంబంధించి ప్రతి జిల్లాకు వేర్వేరుగా గెజిట్‌ నోటిఫికేషన్‌ ను జారీ చేశారు. ఈ ప్రతిపాదనపై ఏమైనా అభ్యంతరాలు, సూచనలు 30రోజుల్లో తెలియజేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం పేర్కొంది. కాకినాడ కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు తూర్పు గోదావరి జిల్లా అని, రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న జిల్లాకు రాజమహేంద్రవరం జిల్లా అని పేరు పెట్టినట్లు రాష్ట్ర కేబినేట్‌ మెమోరండంలో పేర్కొన్నారు. అలాగే ఏలూరు కేంద్రంగా ఉన్న జిల్లాకు పశ్చిమగోదావరి జిల్లా అని, భీమవరం కేంద్రంగా ఉన్న జిల్లాకు నరసాపురం జిల్లా అని పేరు పెట్టినట్లు తెలిపారు. కానీ గెజిట్‌ నోటిఫికేషన్లలో మాత్రం కాకినాడ కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు కాకినాడ జిల్లా అని, రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న జిల్లాకు తూర్పు గోదావరి జిల్లాగా... ఏలూరు కేంద్రంగా ఏర్పాటు అయ్యే జిల్లాకు ఏలూరు జిల్లా అని, భీమవరం కేంద్రంగా ఉన్న జిల్లాకు పశ్చిమగోదావరి జిల్లా అని మార్పులు చేశారు. భీమవరం, రాజమహేంద్రవరం కేంద్రాలు ఎక్కువ భాగం గోదావరి నదిని కలిగిఉన్నందున వాటికీ గోదావరి  జిల్లాలుగా ఉండాలని కేబినేట్‌ మంత్రులు సూచినల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలో కనిగిరి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేసినట్లు కేనినేట్‌ మెమోరాండంలో పేర్కొని, గెజిట్‌లో దాని స్థానంలో కొత్తగా పొదిలి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. శ్రీసత్యసాయి జిల్లాలో తొలుత పెనుగొండ, పుట్టపర్తి, కదిరి రెవెన్యూ డివిజన్లుగా ఉంటాయని పేర్కొనగా.. గెజిట్‌లో పెనుగొండ, పుట్టపర్తి, ధర్మవరం రెవెన్యూ డివిజన్లుగా పేర్కొన్నారు. అంతేకాకుండా కొత్త జిల్లాల పేర్లలో అక్షర దోషాలను కూడా ప్రభుత్వం సవరించింది. తిరుపతి అర్బన్‌ జిల్లా ఇంగ్లీష్‌ లో ’టిహెచ్‌ఐ’ ఉండగా ’టిఐ’ గా మార్పు చేశారు. ఇలా అనేక అక్షర మార్పులు చేశారు. వీటితో పాటు ఎస్‌.పి.ఎస్‌ నెల్లూరును.. శ్రీ పొట్టిశ్రీరాములు జిల్లాగా, వైఎస్‌ఆర్‌ కడపను... వైఎస్‌ఆర్‌ జిల్లాగా మార్చారు. బిఎన్‌ కండ్రిక మండలంను బుచ్చినాయుడు మండలంగా మార్పు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపడుతూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. హిందూపురం పార్లమెంటు పరిధిలో కొత్తగా ఏర్పాటవుతున్న జిల్లా పేరును సత్యసాయి జిల్లాగా ఖరారు చేయడంతోపాటు పుట్టపర్తినే జిల్లా కేంద్రంగా నిర్ణయించింది. కొత్త నోటిఫికేషన్‌ ప్రకారం అనంతపురం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలతో పాటు రాప్తాడు నియోజకవర్గాన్ని అనంతపురం జిల్లాలోనే ఉంచారు. కొత్తగా ఏర్పాటైన సత్యసాయి జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉండనున్నాయి. 34 మండలాలు అనంతపురం జిల్లా వైపు రానుండగా 29 మండలాలు సత్యసాయి జిల్లాలో ఉండనున్నాయి. ఈ పునర్విభజనలో కొన్ని రెవెన్యూ డివిజన్లలోనూ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పుడున్న ఐదు స్థానంలో ఆరు మండలాలు రానున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు ఐదు రెవెన్యూ డివిజన్లు ఉండేవి. ఇప్పుడు ఆరుకు పెరగనున్నాయి.ఈ క్రమంలో ఇప్పుడున్న రెవెన్యూ డివిజన్ల నైసర్గిక స్వరూపంలో మార్పులు జరుగనున్నాయి. ఇందులో ప్రధానంగా కదిరి రెవెన్యూ డివిజన్‌ పూర్తిగా మాయం కానుంది. ఆ స్థానంలో పుట్టపర్తి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు కానుంది. అదే సమయంలో ధర్మవరం రెవెన్యూ డివిజన్‌లో నాలుగు మండలాలు మాత్రమే ఉండను న్నాయి. ధర్మవరంలోని చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి రాప్తాడు మండలాలు అనంతపురం రెవెన్యూ డివిజన్‌లోకి చేరనున్నాయి. అనంతపురం పార్లమెంటు పరిధిలో గుంతకల్లు రెవెన్యూ డివిజన్‌ కొత్తగా ఏర్పాటు కానుంది. గుంతకల్లు, ఉరవకొండ నియోజకవర్గాలు ఈ డివిజన్‌లో ఉండనున్నాయి.