.బూస్టర్‌ భేష్‌..

హైదరాబాద్‌,జనవరి 8(జనంసాక్షి): రెండో డోసు తీసుకున్న ఆరు నెలలకు కొవాగ్జిన్‌ బూస్టర్‌ డోసు తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తున్నాయని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ వెల్లడిరచింది. రెండో డోసు తీసుకున్న వారితో పోలిస్తే బూస్టర్‌ డోసు తీసుకున్న వారిలో డెల్టాని నిలువరించే యాంటీబాడీల వృద్ధి ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుందని తెలిపింది. బూస్టర్‌ డోసుపై చేసిన ప్రయోగాలకు సంబంధించి వివరాలను శనివారం విడుదల చేసింది. 90 శాతం మందిలో తీవ్రమైన కొవిడ్‌ స్ట్రెయిన్‌లను సైతం నిలువరించే శక్తిగల యాంటీబాడీలు వృద్ధి చెందినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. బూస్టర్‌ డోసు తీసుకున్నవారిలో టి, బి సెల్‌ రెస్పాన్స్‌ గుర్తించామని తెలిపింది. బూస్టర్‌ డోసు తీసుకోవడం ద్వారా ఎక్కువ కాలం పాటు తీవ్ర కొవిడ్‌ నుంచి రక్షణ పొందొచ్చని పేర్కొంది.