మద్యం మత్తులో వ్యక్తి దారుణం


కత్తితో దాడి చేసి భర్యా సహా ముగ్గురు మహిళల హత్య

అనంతరం అదే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య
మరో ముగ్గురికి తీవకర గాయాలు
శ్రీకాకుళం,జనవరి29 (జనంసాక్షి):   జిల్లాలో దారుణం జరిగింది. మద్యం మత్తులో దారుణానికి తెగబడ్డాడో.. మరేదైనా కుటుంబ కలహమో తెలియదు కానీ కుటుంబంపై కత్తితో అత్యంత దారుణంగా దాడి చేసి మారణ హోమం సృష్టించాడు. ఆపై తాను అత్యంత దారుణంగా గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దాడిలో ముగ్గురు మహిళలు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎచ్చెర్ల మండలంలోని ముద్దాడపేటలో ఈ దారుణం జరిగింది. తన కుటుంబ సభ్యులపై కత్తితో రీసు అప్పన్న దాడి చేశాడు. దాడి అనంతరం నిందితుడు తనను తాను పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పన్న దాడిలో భార్య, అత్తమ్మ, సోదరి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన భార్యతో పాటు అడ్డుగా వచ్చిన సోదరిని కూడా హతమార్చాడు కిరాతకుడు. ఈఘటనలో తండ్రితో పాటు సోదరి కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ముద్దాడపేటలో నివాసముంటే వి.సి అప్పన్న మద్యానికి బానిసయ్యాడు. దీంతో ప్రతిరోజు కుటుంబంలో కలహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భార్య అప్పమ్మపై దాడికి తెగబడ్డాడు. అడ్డుగా వచ్చిన తన సోదరి రాజులను హత్య చేశాడు. భార్యను చంపుతుండగా అడ్జొచ్చిన తన తండ్రితో పాటు సోదరి కుమార్తె పద్మను కూడా అప్పన్న గాయపరిచాడు. ఈ ఘటనలో గాయపడిన వారితో పాటు అప్పన్న శ్రీకాకుళం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. అప్పన్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా, ఈ హత్యలకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.