ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కాంగ్రెస్‌ ధర్నా

హైదరాబాద్‌,జనవరి29 (జనంసాక్షి):   ఉప్పల్‌ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి క్యాంపు కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని యూత్‌ కాంగ్రెస్‌ నేతలు ఆకారపు అరుణ్‌ కుమార్‌, కంది శ్రావణ్‌ ముట్టడిరచారు. ఎమ్మెల్యే అఫీస్‌ దగ్గర యూత్‌ కాంగ్రెస్‌ నేతల ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. పోలీసులు, నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. పోలీసులు, నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.