దేశానికి అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ



ధాన్యం సేకరణలో ముందున్న రాష్ట్రం

తెలంగాణ అభివృద్దిని అడ్డుకుంటున్న కేంద్రం
రంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం
తెలంగాణకు ఏంచేశారో బిజెపి చెప్పాలని కెటిఆర్‌ డిమాండ్‌
హైదరాబాద్‌,జనవరి29(జనంసాక్షి): దేశానికి అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని ఐటి, మున్సిపల్‌ శాఖ మంత్రి కెటిఆర్‌ ప్రశంసించారు. తెలంగాణ ధాన్యాగారంగా మారిందన్నారు. కెసిఆర్‌ తీసుకున్న రైతు సంక్షేమకార్యక్రమాలతో వ్యవసాయం పండగచేసి చూపామని అన్నారు. బడంగ్‌పేట్‌, విూర్‌పేట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో శనివారం టిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌,మంత్రి కెటిఆర్‌ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విూడియాతో మాట్లాడారు. దేశ ఎకానవిూలో తెలంగాణ 5వ స్థానంలో ఉందని, తెలంగాణకు సహకరించకుండా కేంద్ర మోకాలడ్డుతోందని దుయ్యబట్టారు. గత ఏడేన్నరేళ్లుగా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. దమ్ముంటే తెలంగాణకు ఏం చేశారో బిజెపి నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ అభివృద్ధి ఆపలేరన్నారు. ప్రభుత్వాస్పత్రులలో ప్రసవాల సంఖ్య పెరిగిందని మంత్రి కెటిఆర్‌ తెలిపారు. మిషన్‌ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. రైతు బంధు 11 రాష్టాల్రకు ఆదర్శంగా మారిందని ప్రశంసించారు. ప్రధాని నరేంద్ర మోడీ రైతుబంధును కాపీ కొట్టారన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులను తెలంగాణ సర్కార్‌ పరుగులు పెట్టిస్తోంది. రాష్ట్ర మంత్రులు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రగతి పనుల శ్రీకారంలో బిజీగా ఉన్నారు. కేటీఆర్‌ రంగారెడ్డి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తెరాస ప్రభుత్వం ఎలాంటి రాజకీయలాభాపేక్ష లేకుండా పేదప్రజల అభివృద్ధే ధ్యేయంగా.. ముందుకు సాగుతోందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో జల్‌ పల్లి, తుక్కుకూడ, బడంగ్‌ పేట, విూర్‌ పేట మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ నాలుగు మున్సిపాలిటీల్లో ఒకేరోజు రూ.400కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. హైదరాబాద్‌ సవిూపంలో ఉన్నప్పటికీ అభివృద్ధి దూరంగా ఉన్న శివారు మున్సిపాలిటీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మార్గనిర్దేశరలో ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేటీఆర్‌ స్పష్టం చేశారు. మహేశ్వరం పరిధిలోని తుక్కుగూడలో సవిూకృత మార్కెట్‌ నిర్మాణానికి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. కూరగాయలతో పాటు మాంసం విక్రయాలకు సంబంధించి మార్కెట్‌లో సదుపాయాలు కల్పించనున్నారు. సవిూకృత మార్కెట్‌ నిర్మాణానికి 4 కోట్ల 50 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. 108 గదులతో వేర్వేరుగా వెజ్‌, నాన్‌ వెజ్‌ బ్లాక్‌లను నిర్మిస్తారు. 78 గదులతో కూరగాయల బ్లాక్‌, 30 గదులతో మాంసాహార బ్లాక్‌ అందుబాటులోకి తీసుకువస్తారు. తుక్కుగూడకు మంచినీటి పైప్‌లైన్‌ నిర్మాణానికి, జల్‌పల్లిలో రహదారుల విస్తరణకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. రంగారెడ్డి జిల్లాలోనే మరికొన్ని అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టనున్నారు. జల్‌పల్లిలో ఇంటింటికి మిషన్‌ భగీరథ నీళ్లు వస్తున్నాయి. త్వరలో జల్‌పల్లిలో బస్తీ దవాఖానా ఏర్పాటు చేస్తాం. రూ.29 కోట్లతో జల్‌పల్లికి మరో రోడ్డు మంజూరు చేస్తాం. శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. పేద ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నా మని అన్నారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డి
తదితరులు పాల్గొన్నారు.