దుబాయ్‌ కరెన్సీ పట్టివేత

హైదరాబాద్‌,జనవరి29 (జనంసాక్షి):   శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఫారిన్‌ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 33000 సౌదీ అరేబియన్‌ దాలర్స్‌ను కస్టమ్స్‌ గుర్తించారు. దీని విలువల 6.35 లక్షలు

ఉంటుందని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. ఫారెన్‌ కరెన్సీ సీజ్‌ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.