వలసలు నివారించి ఉపాధి కల్పి0చాలి

 గ్రామాలకు దూరగంగా ఇళ్ల నిర్మాణం తగదు

చిత్తూరు,ఫిబ్రవరి21: వలసల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విపక్షాలు మండపడుతున్నాయి. కాలనీల పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఊరికి దూరంగా పంపడం అన్యాయమంటూ పలువురు ప్రజాప్రతినిధులు అధికారుల తీరుపై అగ్రహం వ్యక్తం చేశారు. కరువు కారణంగా గ్రావిూణ ప్రాంతాల ప్రజలు ఇతర రాష్టాల్రకు వలస వెళ్లారని... ప్రస్తుతం వృద్ధులు, విద్యార్థులు మాత్రమే ఇళ్ల వద్ద మిగిలారని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రావిూణ ప్రాంతాల్లో ఇంతటి దారుణ పరిస్థితులు నెలకొన్నా ఉపాధి కల్పనకు అధికారులు చర్యలు తీసుకోక పోవడం బాధాకరమన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో
గతంలో పంచాయతీలకోసం కొనుగోలు చేసిన మోటర్లు, పంపుసెట్లు మాయం చేశారని.... వీటిని రికవరీ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వడంలో అధికారులు చాలా నిర్లక్ష్యం చూపుతున్నారన్నారు.ట్రాన్స్‌ఫార్మర్లు సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో రైతులు పంటలను నష్ట
పోవాల్సి వస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అడవుల్లో, చెరువుల్లో స్థలాలు చూపుతున్నారని... అలాంటి చోట్ల వారెలా కాపురం చేస్తారని అధికారులను నిలదీశారు.ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఊళ్లకు దూరంగా పంపడం అన్యాయమన్నారు. గ్రామానికి కనీసం 20 నుంచి 30మంది దాకా అర్హులున్నా... కేవలం ఐదారు మందిని మాత్రమే అర్హుల జాబితాలో చేరుస్తున్నారన్నారు. స్థలాల కేటాయింపు, అర్హుల ఎంపిక విషయంలో అధికారుల తీరు కారణంగా గ్రావిూణ ప్రాంతాల్లో రచ్చలు జరుగుతున్నాయన్నారు. ఇదిలావుంటే అర్హులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించని కారణంగా గ్రామాల్లో తిరగలేకపోతున్నామని అధికార పార్టీ నేతలే అన్నారు. నిర్బంధ భూసేకరణ ద్వారా అర్హులైన పేదలందరికీ అనువైన ప్రాంతాల్లో స్థలాలు కేటాయించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.