జాతరకు ఇతర జిల్లాల నుండి 117 మంది వైద్యులు


ములుగు(మేడారం)ఫిబ్రవరి11(జనం సాక్షి):-

మేడారంలో ఫిబ్రవరి 16 నుండి ప్రారంభం కానున్న మేడారం జాతరలో సేవలందించేందుకు ఇతర జిల్లాల నుండి 117 మంది వైద్యులు రానున్నట్లు శుక్రవారం ములుగు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య ఒక ప్రకటన లో తెలిపారు.ప్రభుత్వ వైద్యులతో పాటు బిజెపి,ఎన్టీఆర్ ట్రస్టు తరఫున మరికొంత మంది సేవలు అందించనున్నారు. వీరిలో 33 మంది స్పెషలిస్టులు ఉండడం విశేషం.జనగామ నుంచి ఐదుగురు, మహబూబాబాద్ జిల్లా నుంచి 10 మంది, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం నుంచి 17 మంది, ఎన్టీఆర్ ట్రస్టు నుంచి ఇద్దరు, ఎంజిఎం నుంచి 24 మంది, బిజెపి తరపున 10 మంది, హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి నుంచి 9 మంది మహిళా వైద్యులు రానున్నట్లు తెలిపారు. వీరంతా ఈ నెల 15 నుండి విధుల్లో చేరనున్నారని పేర్కొన్నారు.