నామ ముత్తయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో వైరా లో 150 మంది ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాల అందజేత


వైరా(జనంసాక్షి)ది.10-02-2022న నామ ముత్తయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో వైరా లో 150  ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలను అందజేశారు .వైరా మున్సిపాలిటీ లో ఉన్న ఆటో అడ్డాల యూనియన్స్ కి  గురువారం నాడు  ఖాకీ చొక్కాలను పంపిణీ చేశారు .మున్సిపల్ ఆఫీస్ దగ్గర జరిగిన చొక్కాల పంపిణీకి ముఖ్య అతిధులుగా  జిల్లా రైతు బంధు కన్వీనర్ నల్లమల వెంకటేశ్వర్లు , రాష్ట్ర మార్క్ ఫైడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సూతగాని జైపాల్, మండల అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వర్లు, టౌన్ అధ్యక్షులు దార్నా రాజశేఖర్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపీ నామ ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నారని వారు కొనియాడారు . కష్టాల్లో ఉన్న ప్రజలకు ఎంపీ నామ అండగా నిలుస్తున్నారన్నారు . గత మూడు దశాబ్దాలుగా  ట్రస్ట్ ద్వారా చేస్తున్నా సేవలను అభినందించారు . 2009 సంవత్సరం నుండి ఆటో డ్రైవర్లుకు , హమాలీలకు , ఖాకీ చొక్కాలను పంపిణీ చేస్తున్నారన్నారు . నామ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలు హర్షణీయమన్నారు హమాలీలు , ఆటో డ్రైవర్లుకు ఖాకీ చొక్కాలను నిరంతరం పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు మార్గదర్శకత్వంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగిందని . ఖమ్మం జిల్లా ప్రజానీకానికి విస్తృతంగా సేవలు అందించాలని  ట్రస్టును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే . తాను సంపాదించిన దాంట్లో కొంతమేర నిరుపేదలు అన్నార్తులకు సహాయం చేయాలన్న సంకల్పంతో నామ  తన దగ్గరకు వచ్చే నిరుపేదలకు ట్రస్ట్ ద్వారా అవసరమైన సహాయం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని , తనకు ఎంతో ఇష్టమైన తల్లిదండ్రుల పేరు మీద ఖాకీ చొక్కాల వితరణకు టీఆర్ఎస్ లోక్ సభా పక్షనేత , ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు శ్రీకారం చుట్టారని  ఎంపీ నామ నిత్యం ప్రజలతో మమేకం అవుతూ రవాణా శాఖ చట్టం నిబంధనల కారణంగా పట్టణాల్లో ప్రయాణీకులను తరలించే ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను దృష్టి లో పెట్టుకొని నామ తన తల్లిదండ్రులు నామ వరలక్ష్మీ - ముత్తయ్య జ్ఞాపకార్ధం ఖాకీ చొక్కాలను బహుకరించడం ప్రారంభించారు . మంచి నాణ్యత కలిగిన చొక్కాలను అందిస్తున్నారు . అంతేకాకుండా గుర్తింపు పొందిన కంపెనీలో కుట్టించి ఆటో డ్రైవర్లు , హమాలీల సైజులను బట్టీ అందించారు . నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 68 వేల మంది హమాలీలు , ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలను పంపిణీ చేయడం విశేషం...ఈ కార్యక్రమంలో జడ్పీ కో - ఆప్షన్ సభ్యులు లాల్ మహమ్మద్, పొలా శ్రీను, ఎదునూరి శ్రీను, తిరుమలరావు, గుగ్గిళ్ల రాధాకృష్ణ, ఆటో యూనియన్ నాయకులు వెంకట్రావు, ముత్తయ్య, కృష్ణ,నామ సేవా సమితి సభ్యులు  సన్నీ, మురారి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.