ఆటో బోల్తా పడటంతో 16 మంది రోడ్డు ప్రమాదం

 

మహబూబాబాద్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో బోల్తా పడటంతో 16 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా నర్సింహులపేట మండలంలోని కొత్త తండా వద్ద జాతీయ రహదారిపై ఆటో బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో 16 మందికి గాయాలయ్యాయి. గూడెం గ్రామం నుంచి మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో మిర్చి ఏరేందుకు ఆటోలో వెళ్తున్న క్రమంలో ఆటో అదుపు తప్పి మూడు సార్లు పల్టీలు కొట్టి పడిపోయింది.

దీంతో అందులో ప్రయాణిస్తున్న మహబూబీ, ఎస్ కే యాకుబ్, కలమ్మ, నారాయణ, లక్ష్మయ్య, ఎల్లమ్మ, మంగమ్మ, ఉప్పలయ్య, రేణుక, రాములమ్మ సత్యమ్మ, సైదులు, రంజాన్, బి పి.సుశీల, లక్ష్మి, సుగుణమ్మలకు గాయాలయ్యాయి.

కాగా, లక్ష్మి, శైలజ, రాములమ్మ, యాకుబ్, ఉప్పలయ్యకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనం దవాఖానకు తరలించారు. సంఘటనా స్థలానికి ఎస్ఐ మంగిలాల్ చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.