ఐపిఎల్‌ 22కు ఆసన్నమవుతున్న సమయం

ముంబై, పుణెళి వేదికగా మ్యాచ్‌ల నిర్వహణ

ముంబై,ఫిబ్రవరి25( జనంసాక్షి ): క్రికెట్‌ పండుగకు సమయం ఆసన్నమైంది. ఐపీఎల్‌ 2022 సీజన్‌ మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. మే 29న ఫైనల్‌ జరగనుంది. మొత్తం 10 జట్లు 2 గ్రూపులుగా విడిపోయి.. 70 మ్యాచ్‌లు ఆడనున్నాయి. మిగతా 4 ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌లు కావడంతో.. ఈ లీగ్‌లో పూర్తిగా 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లన్నీ కూడా ముంబై, పూణెళి నగరాల్లో ఉన్న 4 స్టేడియాల్లో జరుగుతాయి. ముంబై వాంఖడేలో 20 మ్యాచ్‌లు, బ్రబౌర్న్‌ స్టేడియంలో 15, డీవై పటేల్‌ స్టేడియంలో 20 మ్యాచ్‌లు, పూణెళిలో 15 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మేరకు బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ప్రతీ జట్టు
తమ గ్రూపులోని 4 జట్లతో తలో రెండు మ్యాచ్‌లు, మరో గ్రూపులో ఎదురుగా ఉన్న జట్టుతో 2 మ్యాచ్‌లు, మిగతా నాలుగు జట్లతో ఒక మ్యాచ్‌ ఆడతాయి. ప్లే`ఆఫ్స్‌, ్గªనైల్స్‌కు సంబంధించిన వేదికలను త్వరలోనే ప్రకటిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది.