జి.మాడుగులలో 40 అడుగులు ఆంజనేయ విగ్రహ శంకుస్థాపన..


భీమిలి కి చెందిన సద్గురు సేవాశ్రమం సాయిరాం ఆధ్వర్యంలో..

40 అడుగులు ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం సన్నాహాలు.

శంకుస్థాపన లో పాల్గొన్న పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి..

జి.మాడుగుల. ఫిబ్రవరి 14: జనం సాక్షి.

జి.మాడుగుల మండల కేంద్రంలో స్థానిక గాంధీ నగర్ ప్రాంతంలో 40 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహానికి సోమవారం నాడు వేద పండితుల మంత్రోచ్ఛారణలతో శంకుస్థాపన పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ శంకుస్థాపన పూజా కార్యక్రమానికి  పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి,శ్రీ సాయి దత్తాది పీఠాధిపతి గోకుల నంద స్వామీ, ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఆంజనేయస్వామి విగ్రహానికి ప్రతిష్ట నిర్వహణ ఖర్చు భీమిలి చెందిన సద్గురు సేవా ఆశ్రమం కు చెందిన సాయిరాం స్వామిజీ నిర్మాణం చేయుటకు పూనుకోవడం ఎంతో శుభ పరిణామమని అన్నారు. గిరిజన ప్రాంతంలో ఇలాంటి దైవ కార్యక్రమాలు చేస్తున్న సాయిరాం స్వామీజీకి ధన్యవాదాలు తెలుపుతూ అభినందించారు. ఇందులో భాగంగా ఆయన నిర్మాణ ప్రాంతమంతా పసుపు జలాలతో శుద్ధిచేసి హోమం, గోపూజ, అభిషేకాలతో పూజా కార్యక్రమం, ఆలయ నిర్మాణ కార్యక్రమం, భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జి.మాడుగుల సర్పంచ్, రాంబాబు, పాడేరు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గాయత్రీ దేవి, జి మాడుగుల మండలం వైస్ ఎంపీపీ2 సత్యనారాయణ, జి.మాడుగుల 1ఎంపీటీసీ  విజయ కుమారి,లువ్వాసింగి ఎంపీటీసీ జీ. సన్యాసి దొర, తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వరహాలరాజు, తహశీల్దార్ చిరంజీవి పడాల్,అరకు పార్లమెంట్ వైఎస్ ఆర్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు మత్య్స రాజు,విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మత్య్సరాజు,అప్పలరాజు,  వివిధ గ్రామాల భక్తులు, గ్రామస్తులు, మహిళలు, గాంధీనగర్ యువకులు, పాల్గొన్నారు.