నేటి నుంచే అమల్లోకి పథకం
హైదరాబాద్,ఫిబ్రవరి28 ( జనం సాక్షి): ద్విచక్రవాహనాల పెండిరగ్ చలాన్లకు 75 శాతం రాయితీ ఇస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ..ఆన్‌లైన్ ద్వారా పెండిరగ్ చలాన్లను చెల్లించవచ్చని, ఈ చలాన్ల రాయితీ మార్చి 1 నుంచి 30 వరకు అమలులో ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌లో ఇప్పటివరకు 1.75 లక్షల చలాన్లు పెండిరగ్‌లో ఉన్నాయని, వాటిని ఈ`చలాన్ సిస్టమ్ ద్వార పెండిరగ్ చలాన్లను చెలించాలని అన్నారు. ఆర్టీసీ బస్‌లకు 70శాతం, లైట్ మోటార్ వేహికిల్, హెవీ మోటార్ వాహనాలకు 50శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు గతంలో నో మాస్క చలాన్లు రూ.1000 న్ ఉండగా, ప్రస్తుతం అవి రాయితీ అనంతరం రూ.100 కడితే సరిపోతుందన్నారు. కాగా దీనిపై నేటి రాత్రిలోపు అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
పెండిరగ్ చలాన్లకు 75శాతం రాయితీ