ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 11(జనం సాక్షి) తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం యాచారం మండలం తక్కళ్లపల్లి తండ. మాడ్గుల మండలం కొలకుల పల్లి గ్రామాలలో ఉపాధి కూలీలను కలవడం జరిగింది ఈసందర్బంగా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరి జగన్ జిల్లా జాయింట్ సెక్రటరీ పి అంజయ్య లు మాట్లాడుతూ . కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఉపాధి హామీ చట్టానికి కేవలం 73 వేలకోట్లు కేటాహించి కూలీలకు తీవ్రమైన అన్యాయం చేసింది గత సంవత్సరం 93 వేల కోట్లు కూలీలకు ఖర్చు ఐతే గతం కంటే పెంచవలసింది పోయి 20 వేల కోట్లు తగ్గించడం దుర్మార్గం ఎండాకాలంలో 3నెలలు సమ్మర్ అలవెన్సులు ఇచ్చేవారు ఇప్పుడు అవి తగ్గించడం అనేది మట్టి పనిచేసి మట్టి తినండి అనే పద్ధతి కనపడ్తుంది. తక్కళ్లపల్లి తండాలో 4వారాలు కోలుకుల పెల్లి లో 3 వారలు పెండింగ్ వున్నది కూలీ వారానికి 400నుండి 500 వరకు వస్తుంది మేము ఎట్లా బ్రతకాలి అని కూలీలు ఆవేదన పడ్తున్నారు. ప్రతివారానికి కూలీ డబ్బులు చెల్లించాలి కానీ వారాలు గడిచిన కూలీ డబ్బులు చెల్లించక పోవడం ఏమి పద్ధతి. పే స్లిప్పులు ఇవ్వాల్సి వున్నా ఇవ్వడం లేదు రోజు కూలీ 600రూపాయలు ఇయ్యాలి సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలి పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి పే స్లిప్పులు ఇవ్వాలి కూలి లందరికి పని కల్పించాలి మేట్లకు పారి తోషికం ఇవ్వాలి తదితర సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వం ఎచ్చరిస్తున్నాము ఈ కార్యక్రమంలో కూలీలు నీలా పింట్ల దేవి అంజలి పార్వతి కేస్లీ భూదేవి విజయ నరేందట్ పి రమేష్ సత్తయ్య నర్సింహా చంద్ర కళా పద్మ యాదమ్మ తదితరులు పాల్గొన్నారు