కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్.
తాండూరు ఫిబ్రవరి 8(జనంసాక్షి)
మిడిమిడి జ్ఞానంతో అవగాహన రహితంగా ప్రతిపక్షాలు ఆందోళన చేయడం ఎంత వరకు సమంజసం మని కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్ ప్రశ్నించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా
కోటపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ కి పూలమాల వేసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా
కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలను వక్రీకరించి ప్రతిపక్షాలు బిజెపి,కాంగ్రెస్ ,బిఎస్పి పార్టీల నాయకులు పబ్బం గడుపుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దళితులకు బలహీన వర్గాలకు ఎలాంటి ప్రోత్సాహకాలు అందించలేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన చెంది కేంద్ర ప్రభుత్వాన్ని మార్చాలి రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కులు కలిగించాలి అని మాట్లాడిన దానిని మిడిమిడి జ్ఞానంతో అవగాహన రహితంగా ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయని మండ్డిపడ్డారు. దేశం గర్వించే విధంగా అంబేద్కర్ ఆశయాలను తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల వారికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. కులాలకు మతాలకు అతీతంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ , రైతుబంధు, రైతు బీమా, లాంటి ఎన్నో పథకాలను పేద ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, కోటపల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు ,సీనియర్ నాయకులు లక్కాకుల మల్లేశం, పతంగి పాండు, అనిల్ దొర, ఓగులాపురం రాజు, మండల ప్రధాన కార్యదర్శి కుమ్మరి లాలప్ప,కోటపల్లి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, ఉపాధ్యక్షులు మోసిన్, యువజన నాయకులు మండలి నాగేష్, రైతు సంఘం అధ్యక్షులు రత్నయ్య,యాకూబ్, రత్నయ్య, బ్యాగరి బాల్రాజ్, కేబి రాజు, వెంకటేశం, రహీం తదితరులు పాల్గొన్నారు.