మేడారంలో హేలి రైడ్..


ములుగు(మేడారం),ఫిబ్రవరి11(జనం సాక్షి):-

మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ హేలీ రైడ్ ను ఏర్పాటు చేస్తున్నది. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు మేడారం జాతరకు ఈ ప్రత్యేక సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి యం.శివాజీ తెలిపారు.బెంగుళూరు కు చెందిన తుంబి ఎవియేషన్ సంస్థ హేలీ కాప్టర్ ను ఆదివారం నుండి అందుబాటులో వుంచుతుంది.

హనుమకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ నుండి మేడారం వరకు ప్రయాణానికి గాను(up and down) ఒక్కొక్కరికి రూ. 19,999=00 గా ఛార్జ్ చేస్తారు. మేడారం జాతరలో ఏరియల్ వ్యూ రైడ్ కోసం ఒక్కొక్కరికి రూ. 3700=00 ఛార్జ్ చేస్తారు.

మేడారం జాతరకు వచ్చే భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని ములుగు కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. హేలీ రైడ్ టికెట్ బుకింగ్,ఇతర వివరాల కోసం 9400399999,9880505905 ఫోన్ లో లేదా info@helitaxii.com ద్వారా సంప్రదించవచ్చు.