అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం


` కారు, లారీ ఢీకొని 9మంది మృతి
ఉరవకొండ,ఫిబ్రవరి 6(జనంసాక్షి): అనంతపురం జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం`బళ్లారి జాతీయ రహదారిపై విడపనకల్‌ మండలం కొటాలపల్లి సవిూపంలో ఇన్నోవా కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక బాలుడు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతుల్లో ముగ్గురు బొమ్మనహళ్‌కు చెందిన వారు కాగా, ఉరవకొండ మండలం లక్కవరం గ్రామానికి చెందిన ముగ్గురు ఉన్నారు. మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలం నుంచి మృత దేహాలను పోలీసులు ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా బళ్లారిలోని వివాహానికి హాజరై తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోకా వెంకటప్ప మృతి చెందారు. వీరంతా ఆయన కుమార్తె వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. లారీ, కారు బలంగా ఢీకొనడంతో కారు నుజ్జు నుజ్జయింది. మృతులంతా దగ్గరి బంధువులు కావడంతో ఘటనాస్థలంలో రోదనలు మిన్నంటాయి.