వివాదాస్పద తహశీల్దార్లు మాకు వద్దు. ఆదివాసీ జేఏసీ డిమాండ్..


గూడెంకొత్తవీధి:ఫిబ్రవరి14.జనంసాక్షి. మండల తహశీల్దార్ ఇటీవల కాలంలో బదిలీ కావడంతో ఆ స్థానంలో కొత్తగా వచ్చే తహశీల్దార్  ఎవరైన వివాదాస్పద వక్తులను  నియమించవద్దని ఆదివాసీ జె.ఏ. సి. డిమాండ్ చేసారు. పైరవీలతో పోటీపడి గూడెంకొత్తవీధి మండల తహశీల్దార్ గా రావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం తెలిసిందని గూడెంకొత్తవీధి మండలం ఇప్పటికే అభివృద్ధికి దూరంగా మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో నిరుద్యోగ యువత పేర్లతో  బినామీ అభ్యర్థులను  ఎంపిక చేసుకొని ఇప్పటికే మైనింగ్ మాఫియా తెరవెనుక వారి ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నాయని  ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల అందుబాటులో వుండి  గిరిజన  చట్టాలపై  పూర్తి అవగాహనకలిగిన తహశీల్దార్ని నియమించాలని జిల్లా అధికారులను ఆదివాసీ జె.ఏ. సి  విజ్ఞప్తి చేస్తున్నారు. వివాదాస్పద తహశీల్దార్కు గూడెంకొత్తవీధి మండలంలో నియమిస్తే  ఆదివాసీ ప్రజానీకం.ఆదివాసీ జె.ఏ. సి మండలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం.ఈ కార్యక్రమంలో రాష్ట్ర  జె.ఏ. సి.వైస్ చెర్మన్ మొట్టడం రాజ బాబు. మండల కన్వీనర్ కొర్ర బలరాం. మండల.జె.ఏ. సీ నాయకులు రీమల పాల్. కొర్ర నిలకంఠం .మార్కు రాజు.గొర్లె యేసు వరరాజు.శోభ జగన్.సుంకరి విష్ణు మూర్తి.పోతురాజు గోవిందు. అల్లంకి రాజు.సోన్ను తదితరులు పాల్గొన్నారు.