నారాయ‌ణ‌ఖేడ్ పట్టణ శివారులోశంకుస్థాపన

 హైద‌రాబాద్ : మ‌రికాసేప‌ట్లో ముఖ్య‌మంత్రి క‌ల్వకుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు సంగారెడ్డి జిల్లా ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేర‌నున్నారు. మ‌ధ్యాహ్నం 1:30 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి రోడ్డుమార్గాన బేగంపేట ఎయిర్‌పోర్టుకు సీఎం కేసీఆర్ చేరుకుంటారు. అక్క‌డ్నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో సంగారెడ్డికి బ‌య‌ల్దేరుతారు. మ‌ధ్యాహ్నం 2:10 గంట‌ల‌కు నారాయ‌ణ్‌ఖేడ్ ప‌ట్ట‌ణానికి సీఎం చేరుకుంటారు.

రూ.4,427 కోట్లతో నిర్మించనున్న సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నారాయ‌ణ‌ఖేడ్ పట్టణ శివారులో శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే 1.30 లక్షల మందితో నిర్వహించనున్న బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తరువాత కొద్దిసేపు టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు, అధికారులతో ముచ్చటించి, సాయంత్రంకేసీఆర్  4:30 గంట‌ల‌కు హైదరాబాద్‌కు హెలికాప్ట‌ర్‌లో బయలుదేరుతారు.