వివేకా హత్యకేసు సిబిఐ చూస్తోంది: డిజిపి

అమరావతి,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందా హత్య కేసు విచారణలో రాష్ట్ర పోలీసులపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఏపీ డీజీపీ రాజేంధ్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్‌ వివేకా హత్య కేసును సీబీఐ చూస్తోందని వెల్లడిరచారు. తమ దృష్టాంతా అక్రమంగా సాగవుతున్న గంజాయి ,అక్రమ రవాణా నియంత్రణకు ఒడిశాతో జాయింట్‌ ఆపరేషన్‌ చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ అక్రమ రవాణా, వినియోగంపై గట్టి నిఘా వేసి ఉంచామని ఆయన పేర్కొన్నారు. కళాశాలలు, రిసార్ట్స్‌, కాటేజ్‌లపై ప్రత్యేక దృష్టిని సారించామని అన్నారు. ఏపీలో సైబర్‌ నేరాల సంఖ్య తగ్గుతుందని ఆయన తెలిపారు.