నమో.. అంటే నమ్మించి మోసం చేయడం

 


` తెలంగాణ ఉనికినే ప్రశ్నిస్తున్న ప్రధాని మోడీ
` ఎల్‌ఐసి లాంటి సంస్థలను తెగనమ్ముతున్నారు
` మాటల్లో తీపి తప్ప ఎక్కడా పనితనం లేదు
` తెలంగాణ అభివృద్దికి పైసా కేటాయించని మోడీ
` సిరిసిల్ల సభలో ఘాటు విమర్శలు చేసిన కేటీఆర్‌
రాజన్న సిరిసిల్ల,ఫిబ్రవరి 18(జనంసాక్షి):మోడీని నమ్మిన ప్రజలు ఘోరంగా మోసపోయారని, నమో అంటేనమ్మించిమోసం చేసేవాడని భారత ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. 2014లో మోదీని ఈ దేశ ప్రజలు నమ్మడమే అతిపెద్ద తప్పు అని కేటీఆర్‌ పేర్కొన్నారు. నమో అంటే నరేంద్ర మోదీ కాదు.. నమో అంటే నమ్మించి మోసం చేసేటోడు అని కేటీఆర్‌ విమర్శించారు. జీవితాలు మార్చు అని అధికారం అప్పగిస్తే.. ఉన్న జీవిత బీమా సంస్థను కూడా అమ్మేస్తుండు. నినాదాలు అద్భుతంగా ఉంటాయి.. కానీ పని మాత్రం లేదు అని మోదీ పాలనను కేటీఆర్‌ ఎండగట్టారు. రాజన్న సిరిసిల్లలోని సాయి మణికంఠ ఫంక్షన్‌ హాల్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులుగా తోట ఆగయ్య ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ హాజరై ప్రసంగించారు. ఏండ్ల కింద ఇవాళ భారత ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఏపీలో ప్రచారం చేసి అడ్డంగా మాట్లాడిరడు. ఏపీ విభజన చాలా దారుణంగా చేశారు. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని మోదీ మాట్లాడారు. ఓట్ల కోసం మాట్లాడిరడు అనుకున్నాం. ఆ రోజు కూడా లొల్లి పెట్టాం.. కానీ తెలవనితనం అనుకున్నాం. నిన్న కాక మొన్న అసందర్భంగా పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. తలుపులు మూసి అన్యాయంగా విభజన చేశారని అడ్డగోలుగా మాట్లాడిరడు. బిల్లు ఓటింగ్‌కు వస్తే పక్కా దర్వాజాలు బంద్‌ చేసే పాస్‌ చేస్తారు. ఇది కూడా తెలువనోడు మన ప్రధాని కావడం దౌర్భాగ్యం అంటూ విరుచుకు పడ్డారు. ప్రగతిపథంలో దూసుకుపోతున్న తెలంగాణకు సాయం చేయకుండా, ఈ రాష్ట్ర పుట్టుకనే ప్రశ్నిస్తున్నాడు. తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తున్న బీజేపీకి ఇక్కడ పుట్టగతులు ఉండాల్నా ఆలోచించుకోవాలి. మిషన్‌ భగీరథను సిగ్గులేకుండా కాపీ కొట్టి మనకు నిధులు ఇవ్వడు అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. బీహార్‌లో ఓ వ్యక్తి అకౌంట్లో రూ. 10 లక్షలు జమ అయ్యాయి. మోదీ పంపిండు అని ఆ పైసలతో ఇల్లు కట్టుకుండు. మోదీ పంపలేదు. అదంతా అబద్దం.. పైసలు కట్టు అని బ్యాంకు అధికారి నిలదీస్తే ఆ వ్యక్తి దీక్ష చేసిండు. జన్‌ ధన్‌ ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తానని మోదీ మాట మరిచారు. 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పి మోసం చేశారు. ఉద్యోగాల గురించి విూడియా ప్రశ్నిస్తే.. మోదీ తెలివిగా సమాధానం చెప్పాడు. విూ సిరిసిల్ల హాస్పిటల్‌ ముందట పకోడి వేసుకోవడం ఉద్యోగం కదా? అని మోదీ అంటున్నాడని కేటీఆర్‌ మండిపడ్డారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మోదీకి సిగ్గు, నీతి అనేవి లేవని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణ గడ్డపై బీజేపీకి పుట్టగతులుండవని కేటీఆర్‌ జోస్యం చెప్పారు. బీజేపీ ఎంపీలు రాష్టాన్రికి ఒక్క పైసా తీసుకురాలేదని, మిషన్‌ భగీరథను మోదీ సిగ్గు లేకుండా కాపీ కొట్టారని కేటీఆర్‌ అన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి?, మోదీని నమ్మడమే దేశం చేసిన తప్పు అని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. నమో అంటే.. నమ్మించి మోసం చేసినోడని కేటీఆర్‌ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర బిల్లు సరిగ్గా ఇదే రోజు 8 ఏండ్ల క్రితం పార్లమెంట్‌లో పాస్‌ అయింది. ఈ శుభదినంన తోట ఆగయ్య ప్రమాణస్వీకారం చేయడం సంతోషించదగ్గ విషయం అని కేటీఆర్‌ కొనియాడారు. గీ తెలంగాణ లీడర్లకు తెలివిందా? నాయకత్వ సత్తా ఉందా? విూకు పరిపాలించే సీన్‌ ఉందా? అని సమైక్యవాదులు పలు రకాలుగా అడ్డగోలు వాదనలు చేశారు. విద్యుత్‌ సమస్య ఏర్పడుతదని ఓ సీఎం అన్నారు. కొత్త కొలువులు, కొత్త పెట్టుబడులే కాదు.. ఉన్న కొలువులు, పెట్టుబడులు వెనక్కిపోతాయని మరొకరు అన్నారు. ఇష్టమొచ్చిన మాటలు మాట్లాడారు. కానీ ఇవాళ 8 ఏండ్ల తర్వాత తెలంగాణ మోడల్‌ భారతదేశానికే దిక్సూచిగా మారింది. మన పథకాలను చాలా రాష్టాల్రు అనుసరిస్తున్నాయి. ఇది కేసీఆర్‌ పరిపాలనకు నిదర్శనం. ఇవాళ మన అభివృద్ధిని చూసి భారతదేశమే అబ్బురపడుతోంది. ఇవాళ తెలంగాణ చేసిన పనిని, రేపు భారతదేశం అమలు చేస్తోందనే స్థాయికి ఎదిగామన్నారు. 60 ఏండ్లలో కాని పనులు ఆరేడు ఏండ్లలోనే అయ్యాయి. ఇది కేసీఆర్‌ వల్లే సాధ్యమైందన్నారు. కెసిఆర్‌ను విమర్శిస్తే ఫిరంగులై గర్జించండి.కేసీఆర్‌ను ఎవరైనా ఒక మాట అంటే ఊరుకునేది లేదంటూ మంత్రికెటిఆర్‌ ఘాటుగగానే హెచ్చరించారు. జనగామ, ఆర్మూర్‌లో బీజేపీ నాయకులను పొట్టుపొట్టు తన్నారు. హద్దులు దాటితే తప్పకుండా బుద్ధి చెప్తాం అని బీజేపీ నేతలను కేటీఆర్‌ హెచ్చరించారు. సిరిసిల్ల గడ్డ విూద చైతన్యం చూపిస్తాం. ఇక నుంచి ఊకోం అని తేల్చిచెప్పారు. తెలంగాణను సాధించిన కేసీఆర్‌ను ఏమైనా అంటే.. పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడి వాళ్లం అక్కడ ఒక్కొక్క కార్యకర్త.. కేసీఆర్‌ లాగా ఫిరంగులై గర్జించాలి. తప్పకుండా విరుచుపడాలి. కేసీఆర్‌ తెలంగాణకు ఏం తక్కువ చేసిండు అని బీజేపీ నాయకులను నిలదీయాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులపై మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజన్న సిరిసిల్లలోని సాయి మణికంఠ ఫంక్షన్‌ హాల్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులుగా తోట ఆగయ్య ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ హాజరై ప్రసంగించారు.గల్లీ టు ఢల్లీి మనమే ఉన్నాం అని కేటీఆర్‌ తెలిపారు. అవులాగాడు, బేకూఫ్‌గాడు మాట్లాడితే బెదరొద్దు. ఏ నాయకుడు చేయని పని కేసీఆర్‌ చేసి తెలంగాణను అభివృద్ధి చేశారు. ఇదే సందర్భంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌పై మంత్రి కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే మోదీ వద్దకు వెళ్లి వేములవాడకు రూ. 1000 కోట్ల ప్యాకేజీ తీసుకురావాలని బండి సంజయ్‌కు కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. బీజేపీ అంటే బక్వాస్‌ రaూఠా పార్టీ.. లొల్లి ఎక్కువ, చేసేది తక్కువ. అందుకే ఈ కొత్త పేరు పెట్టాం. బీజేపీ బట్టలిప్పి నగ్నంగా నిలబెట్టాలి. చండాలమైన బీజేపీ పద్ధతులను ఎండగట్టాలని కేటీఆర్‌ సూచించారు. బండి సంజయ్‌ ఎంపీగా గెలిచి మూడేండ్లు అవుతోంది. ఈ కాలంలో మూడు పైసలు కూడా తేలేదు. విూ మోదీ పెద్ద పోటుగాడు కదా.. వేములవాడ రాజన్నకు పైసలు తీసుకురా. అయోధ్యకు ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వరు. సిరిసిల్ల నేతన్నలకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వరు. కర్ణాటకలోని అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తరు. మనం అరిచినా, గీ పెట్టినా కూడా మనకు జాతీయ హోదా ఇవ్వరు. మోదీ కేవలం ఉత్తర భారతానికే ప్రధాన మంత్రా? తెలంగాణ ప్రజల విూద ఎందుకింత వివక్ష? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణకు సాయం చేయకుండా అడ్డగోలు మాటలు మాట్లాడుతారు అని బీజేపీ నాయకులపై కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. మేడారం జాతరను మినీ కుంభమేళా అంటారు. ఐదారు రాష్టాల్ర నుంచి లక్షల మంది భక్తులు వస్తారు. అట్లాంటి జాతరకు కేంద్రం కేవలం రూ. రెండున్నర కోట్లు మాత్రమే ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన కుంభమేళాకు రూ. 375 కోట్లు ఇచ్చారు. మనకు ముష్టి వేసినట్టు రూ. రెండున్నర కోట్లు ఇచ్చారు. కిషన్‌ రెడ్డి సిగ్గులేకుండా.. ఇది మినీ కుంభమేళా అని అంటారు.. కానీ నిధులు మాత్రం తీసుకురారు. కరీంనగర్‌కు ఒక ట్రిపుల్‌ ఐటీ కావాలని అడిగితే ఇవ్వలేదు. ఈ ఎనిమిదేండ్లలో తెలంగాణకు ఎన్ని విద్యాసంస్థలు ఇచ్చారు? అని కిషన్‌ రెడ్డిని కేటీఆర్‌ ప్రశ్నించారు.

 

కేటీఆర్‌కు అరుదైన గౌరవం
` హార్వార్డ్‌ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం
హైదరాబాద్‌,ఫిబ్రవరి 18(జనంసాక్షి):మంత్రి కె.తారకరామారావు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదిక పైన ప్రసంగించబోతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న హార్వర్డ్‌ ఇండియా కాన్ఫరెన్స్‌ లో మంత్రి కేటీఆర్‌ ప్రసంగించబోతున్నారు. ఈ మేరకు మంత్రి కే.తారకరామారావు కి హార్వర్డ్‌ ఇండియా కాన్ఫరెన్స్‌ నిర్వాహకులు ఇప్పటికే ఆహ్వానం పంపించారు. ఈనెల 20వ తేదీన మంత్రి కేటీఆర్‌ ఇండియా ఏ2030 ` ట్రాన్స్ఫర్మేషనల్‌ డికేడ్‌ అనే అంశం పైన మంత్రి కేటీఆర్‌ తన ఆలోచనలను పంచుకోబోతున్నారు. 20వ తేదీన సాయంత్రం ఆరున్నర గంటలకు మంత్రి ఈ సదస్సు లో వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమంలో ప్రసంగించబోతున్నారు. ఈ దశాబ్దంలో భారతదేశ పురోగతి శీఘ్రగతిన జరగాలంటే ప్రభుత్వాలు వివిధ రంగాల్లో ముఖ్యంగా వ్యాపార వాణిజ్యము, ప్రభుత్వ విధానాలు, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌, బిజినెస్‌ మహిళలకు ప్రాధాన్యత కల్పించే బిజినెస్‌ ఇంక్యుబేటర్లు, ఐటి మరియు ఐటి అనుబంధ రంగాల్లో తీసుకోవాల్సిన చర్యల పైన మంత్రి తన ఆలోచనలను పంచుకుంటారు. తన ప్రసంగంలో మంత్రి కేటీఆర్‌ ఆయా రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం తన విప్లవాత్మక, వినూత్న విధానాలతో సాధించిన సానుకూల మార్పులను, ప్రగతిని ప్రస్తావించనున్నారు. తనకు ఆహ్వానం పంపిన హార్వర్డ్‌ ఇండియా కాన్ఫరెన్స్‌ నిర్వాహకులకు మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. కాన్ఫరెన్స్‌ లో భాగస్వామి అయ్యేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు కేటీఆర్‌ తెలిపారు.