వైసిపి పాలనలో అక్రమాలకు అంతేలేదు: సోమిరెడ్డి

నెల్లూరు,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  రాష్ట్రంలో రైతులను సర్వనాశనం చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ అవినీతిని ప్రశ్నిస్తుంటే అక్రమంగా తప్పుడు కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. పొదలకూరులో భూ దందా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని తప్పుబట్టారు. మాజీమంత్రి వైఎస్‌ వివేకాను అతి కిరాతకంగా హత్య చేస్తే.. రెండున్నరేళ్లుగా ఏంచేస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఇంతగా అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నా ఎందుకు స్పందించరని అన్నారు.