పోడు పట్టాలపై కేసీఆర్ మాట తప్పితే ఉపేక్షించేది లేదు-అఖిలపక్షం


-అఖిలపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు

గుండాల,ఫిబ్రవరి10(జనంసాక్షి);ప్రభుత్వం పోడు భూముల కు పట్టాలు ఇస్తామని గిరిజనుల నుండి పట్టాల కోసం భూముల వివరాలు సేకరించి ఇప్పుడు శాటిలైట్ ద్వారా మీ భూములు 2005 కి ముందు పోడు సాగు చేసినవి కాదని పేర్కొంటూ అటవీశాఖ అధికారులు గిరిజనుల ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇంతక మునుపు ఆత్మహత్య చేసుకున్న రైతుల ఎవరు ఆధైర్యానికి గురికావడం జరగ వద్దని మీ తరపున మేము పోరాడుతామని పోరాడే వాడికే భూమి దక్కుతున్నదని మనం చిన్ననాటి నుండి చూస్తున్నామని కాబట్టి ఎవరైనా కూడా ఏం సమస్య ఉన్న తమకు తెలియజేయాలని కోరారు.ఇప్పటికి అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులకు పట్టాలు ఇచ్చి ,తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని లేని పక్షంలో ప్రభుత్వం తో యుద్ధం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీజెఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం,సీపీఐ రాష్ట్ర నేత చాడ వెంకటరెడ్డి,తమ్మినేని వీరభద్రం,సీపీఐ(ఎం ఎల్)రాష్ట్ర నేత పోటు రంగారావు,సాధినేని తదితర రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.