విషాదంలోనూ దిగజారుడు రాజకీయాలా

 మండిపడ్డ వైసిపి ఎమ్మెల్యే పార్థసారథి

అమరావతి,ఫిబ్రవరి23  (జనం సాక్షి): గౌతమ్‌రెడ్డి మరణంతో ప్రజలు విషాదంలో ఉన్నారని.. ఈ సమయంలో టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారధి మండిపడ్డారు. కనీస మానవత్వం లేకుండా టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. టీడీపీ నాయకులు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ‘టీడీపీ, బీజేపీ నాయకులు మాట్లాడుతున్న తీరు సిగ్గుచేటు. సుజనా చౌదరి ఆడిరచిన నాటకంలో తోలు బొమ్మల్లా ఆడుతున్నారు. విభజనతో జరిగిన అన్యాయంపై జీవీఎల్‌ ఎందుకు మాట్లాడటం లేదు. కరోనాను రాష్ట ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంది. బీజేపీ పాలిత రాష్టాల్లో అమ్మ ఒడి, చేయూత వంటి కార్యక్రమాలు ఉన్నాయా అంటూ పార్థసారథి ప్రశ్నించారు. నాడు`నేడు కార్యక్రమం కోసం ఏపీకి ఏమైనా ఆర్థిక చేస్తున్నారా అంటూ దుయ్యబట్టారు. ఏపీకి న్యాయం చేయాలనే ఆలోచన బీజేపీ ప్రభుత్వానికి ఉందా?. బాధ్యతల నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పారిపోతోందని పార్థసారధి మండిపడ్డారు.