మాకవరపాలెం. ఫిబ్రవరి.14.( జనంసాక్షి )....విశాఖ జిల్లా వ్యాప్తంగా వినియోగదారుల సమైక్య ఆధ్వర్యంలో (ఫెడ్కో) మండలాల ఫుడ్ విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు జిల్లా వినియోగదారుల సంక్షేమ సంఘాల ఛైర్మన్ మర్రి సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక రెవెన్యూకార్యాలయంలో తహశీల్ధార్ రాణి అమ్మాజీ కి సంఘాల ఏర్పాటుపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా. మర్రి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ఫుడ్ విజిలెన్స్ కమీటీ లు ఏర్పాటు చేసి ప్రభుత్వ రేషన్. షాపులు. అంగన్వాడీ కేంద్రాలు. పాఠశాలలు. హోటల్స్. కిరాణా.షాపులు ల్లో. ఎటువంటి అవ కతవకులు జరిగినవాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ సంస్థల్లో వినియోగదారుల కు అందే సరుకులు. మధ్యాహ్న భోజన పథకంపై ఈ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో. మండల వినియోగ దారుల సంగం సభ్యులు. బోలెం వరహాలదొర. పి.శ్రీనివాసరావు. రుత్తల కృష్ణవేణి. జి.రఘు తదితరులు పాల్గొన్నారు
మండలాల ఫుడ్ విజిలెన్స్ కమిటీలు ఏర్పాటుపై తహసీల్దార్ కి వినతి పత్రం అందచేస్తున్న సంగం. చైర్మన్. సత్యనారాయణ..