ఎపిలో తగ్గుముఖం పట్టిన కేసులు

అమరావతి,ఫిబ్రవరి23 (జనం సాక్షి) : ఆంధప్రదేశ్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 19, 432 మందికి కరోనా పరీక్షలు నిర్దారించగా కొత్తగా 253 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. 635 మంది బాధితులు కరోనా బారి నుంచి కోలుకున్నారని ఏపీ వైద్యాధికారులు వెల్లడిరచారు. ప్రస్తుతం ఏపీలో 5,181 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయని వివరించారు. నిన్న 244 కరోనా కేసులు వెలుగు చూశాయి.