సీఎం సభాస్థలి పరిశీలన


 సంగారెడ్డి  జనం సాక్షి ఫిబ్రవరి 03

 సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేయనున్నరని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, మరియు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చింత ప్రభాకర్ అన్నారు. నేడు రాయికోడ్ మండలంలోని జంబ్గి (కే), నాగ్వార్,ధర్మపుర్ గ్రామ శివారుల్లో సభ నిర్వహణకు అనువైన సభాస్థలలను పరిశీలించారు. సింగూర్ ప్రాజెక్ట్ మంజీరా నదిపై ఏర్పాటవుతున్న లిఫ్ట్  ప్రాజెక్టు వల్ల ఆందోల్ తోపాటు జహిరాబాద్, సంగారెడ్డి, నారాయణఖేడ్ నియోజకవర్గ రైతన్నలకు సాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తో పాటు సంగారెడ్డి జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు చింతా ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, రాష్ట్ర జాగృతి అధ్యక్షుడు భిక్షపతి,పలు మండలల ప్రజాప్రతినిధులు, మరియు పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.