జనంసాక్షి ఎఫెక్ట్


రోడ్డు లేకుండా అవస్థలు పడుతున్నాం అనే వార్తకి స్పందన

రోడ్డు పనులు ప్రారంభం..

మల్హర్,జనంసాక్షి

మల్హర్ మండలోని బిసి కాలనిలో 4వ వార్డ్ 5వ వార్డ్ ప్రజలు రోడ్డు లేక అవస్థలు పడుతున్నారని ఈ నెల 17 తేది బుధవారం జనంసాక్షి ప్రచురించిన  రోడ్డు లేక అవస్థలు పడుతున్నాం అనే వార్తకి అదికారులు,నాయకులు స్పందించి తాడిచెర్ల గ్రామంలో బిసి కాలనిలో 4వ వార్డ్,5వ వార్డ్ లో రోడ్డు పనులు ప్రారంభించారు. బిసి కాలని ప్రజలు రోడ్డు పనులు ప్రారంభించినదుకు ఆ కాలని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ జనంసాక్షి పత్రికకు కృతజ్ఞతలు తెలియజేశారు.