మహిళ కూలీలకు రక్షణ చట్టలపై అవగాహన కల్పించిన :- సఖి సెంటర్ సిబ్బంది


జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల పరిధిలోని పార్చర్ల స్టేజి సమీపంలో ఉన్న పంటపొలాలో  పనిచేసే మహిళా కూలీలకు సఖి సెంటర్ సిబ్బంది అధ్వర్యంలో గృహ హింస నుంచి మహిళలకు రక్షణ చట్టలపై అవగాహన కల్పించారు.. ఈ సందర్భంగా సఖి సెంటర్ ప్యారా మెడికల్ సిబ్బంది కీర్తన, మరియామ్మలు రైతు కూలీలతో మాట్లాడుతూ గృహ హింస పనిచేసే చోట వేధింపులు,లైంగిక వేధింపులు,వరకట్న వేధింపులు ఆడపిల్లల అమ్మకం, రవాణాల నివారణ కోసం మహిళా హెల్ప్లైన్ కోసం 181 కు ఫోన్ చేసి సఖి కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు...