( జనం సాక్షి):
అగ్ర హీరో పవన్ కళ్యాణ్ నటించిన కొత్త సినిమా’భీమ్లా నాయక్’ విజయాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ విజ్ఞప్తి చేశారు.’భీమ్లా నాయక్’ సినిమాను ఏపీలో గతంలో ఉన్న తక్కువ టికెట్ రేట్లకే ప్రదర్శిస్తున్నారనే విషయంపై ఆయన స్పందించారు. సమస్యను ఇక్కడితో ఆపేసి, సినిమా అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. సోషల్ విూడియా ద్వారా అభిప్రాయం తెలియజేశారు ప్రకాష్‌రాజ్. ’సృజన, సాంకేతికత మేళవించిన సినిమారంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటి చిత్రపరిశ్రమను క్షోభ పెడుతూనే మేమే ప్రోత్సహిస్తున్నామంటే నమ్మాలా? ఏవైనా విభేదాలు ఉంటే రాజకీయ క్షేత్రంలో చూసుకోవాలి. కక్ష సాధింపులు బాక్సాఫీస్ దగ్గర ఎందుకు? ఎంతగా ఇబ్బంది పెట్టినా ప్రేక్షకుల ఆదరాభిమానాలకు ఎవరూ అడ్డుకోలేరు’అని ట్వీట్‌లో పేర్కొన్నారు.