చార్మినార్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు

హైదరాబాద్‌  4(జనం సాక్షి) 

 హైదరాబాద్‌లోని పాతబస్తీని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి ఉద్రిక్త ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చార్మినార్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే, పార్టీ అధినేతపై జరిగిన దాడిని ఖండిస్తూ శుక్రవారం మధ్యాహ్నం ఒక్క సారిగా ఏఐఎంఐఎం మద్దతుదారులు చార్మినార్ వద్ద నిరసనలు జరిపుతూ భారీ ర్యాలీగా వచ్చారు. దీంతో చార్మినార్ పరిసర ప్రాంతాలు నిరసనకారులతో నిండిపోయాయి.