కురుమిద్ద నందివనపర్తి గ్రామాల్లో ఎంపిడిఓ ఆకస్మిక తనిఖీ


ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 8 (జనంసాక్షి):  యాచారం మండల పరిధిలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనుల్ని మంగళవారం ఎంపీడీఓ విజయలక్ష్మి పరిశీలించారు. కుర్మిద్ద గ్రామపంచాయతీలోని పల్లె ప్రకృతి వనం, కంపోస్ట్ షెడ్, నర్సరీ, రహదారి వెంటనున్న మొక్కల పెంపకం కోసమై ఉపాధి కూలీలు చేస్తున్న పనులు, రహదారుల పరిశుభ్రతతోపాటు నందివనపర్తిలో రహదారుల పరిశుభ్రత, అంగన్‌వాడీలను సందర్శించారు. కార్యక్రమంలో కుర్మిద్ద సర్పంచ్ బందె రాజశేఖర్ రెడ్డి, టీఏ కృష్ణమాచారి, ఈసీ, కార్యదర్శి పాల్గొన్నారు.