తండాలను అభివృద్ది చేసిన ఘనత కెసిఆర్‌దే


పంచాయితీలుగా చేసి నిధులిస్తున్నాం

బంజారాల అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు
పేవలాల్‌ జయంతి సభలో మంత్రి ఎర్రబెల్లి
మహబూబాబాద్‌,ఫిబ్రవరి26(జనం సాక్షి ): తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలనను చేర్చిన ఏకైక ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని పంచాయతీరాజ్‌, గ్రావిూణ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. గిరిజనుల సమగ్రాభివృద్దికి ఇది దోహదపడిరదన్నారు. 3వేల తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. ప్రతి సంవత్సరానికి 5 లక్షల చొప్పున తండాల అభివృద్ధికి కేటాయించడం జరుగుతుందని అన్నారు. బంజారాల అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు భూ కేటాయింపు చేయడం జరిగిందని అంటూ.. రానున్న రోజుల్లో గుడి నిర్మాణం చేసుకోవాలని సంబంధించిన నిధులు మంజూరు చేస్తానని మంత్రి తెలిపారు. శనివారం మధ్యాహ్నం తొర్రూరు డివిజన్‌ కేంద్రంలోని బంజారానగర్‌ దుబ్బ తండాలో 5వార్డ్‌ కౌన్సిలర్‌ సునీత జెసింగ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ 283 జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత పండుగలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడిరచారు. సంత్‌ సేవాలాల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ జిల్లాలో జన్మించాడని, బ్రహ్మచారిగా ఉండి జాతి కోసం అహర్నిశలు సేవలందించి మహోన్నతుడు అయ్యాడని మంత్రి కొనియాడారు. ఆయన చేసిన సేవలను గుర్తించి దైవంగా ఆయన పండుగను అధికారికంగా జరుపుకుంటున్నామని అన్నారు. మన వస్త్రాల వేషధారణ మన గుర్తింపు అని, అడవుల్లో జీవనం వలన క్రూర మృగాల నుండి రక్షించుటకై పూర్వం నుండి అద్దాలు ఉన్న వష్తాల్రు చేతికి నిండుగా గాజులు ధరించుట సాంప్రదాయంగా మారిందని సేవాలాల్‌ సేవలను ఆచరిస్తూ భవిష్యత్తు తరాలకు ఆయన చేసిన మంచి పనులను సమాజంలో నిలపాలని మంత్రి అన్నారు. బంజారాలనీటేనే మంచికి మారుపేరు అని మాటిస్తే తప్పని వారని, నా గెలుపుకు ప్రతి సారి విూరు ఆశీర్వదించడం వల్లనే మంత్రిగా విూ ముందుకు వచ్చానని సేవాలాల్‌తో పాటు విూ ఆశీర్వాదం కూడా ఉండాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేష్‌ బాబు, ఎంపీపీలు చిన్న అంజయ్య, ఈదురు రాజేశ్వరి, జడ్పిటిసి లు శ్రీనివాస్‌, సత్యవతి, జోతిర్మయి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ రామచంద్రయ్య, మాజీ గిరిజన కార్పొరేషన్‌ చైర్మన్‌ గాంధీ నాయక్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శాంత, ఎంపీడీవో కుమార్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సురేందర్‌ రెడ్డి, సేవాలాల్‌ ఉత్సవ కమిటీ సభ్యులు ,అధికారులు తదితరులు పాల్గొన్నారు.