సిసిఐ సంస్థను పునరుద్దరించాలి

 జోగురామన్న ఆధ్వర్యంలో ఆందోళన

అదిలాబాద్‌,ఫిబ్రవరి10(జనంసాక్షి): జిల్లాలోని సిమెంట్‌ పరిశ్రమను సిసిఐని పునరుద్ధరించాలని సీసీఐ సాధన కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు గురువారం కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఆదిలాబాద్‌ రూరల్‌ మండలంలో గల చెక్‌ పోస్ట్‌ వద్ద టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్‌ సిమెంట్‌ పరిశ్రమను ప్రారంభించాలని జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజుల నుంచి ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని తెలిపారు.
జిల్లాప్రజలకుఉపాధి ఉద్యోగాలను కల్పించే సిసిఐని తెరిపించడంలో కేంద్రం నిర్లక్ష్యంచేస్తోందని జోగు రామన్న అన్నారు. సిసిఐ పునరుద్దరిస్తే తగిన సహకారంఅందిస్తామని మంతరి కెటిఆర్‌ కేంద్రానికి లేక రాసినా స్పందన లేదన్నారు. గుజరాత్‌కంటే అభివృద్ధి చెందుతున్న రాష్టాన్న్రి ప్రోత్సహించాల్సింది పోయి తెలంగాణపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ విషం కక్కుతున్నారని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. రాజ్యసభ సాక్షిగా తలుపులు వేసుకొని తెలంగాణ బిల్లు పాస్‌ చేసుకున్నారని ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు దీనికి నిదర్శనమని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమకారులను, తెలంగాణ
నేపథ్యాన్ని కించపరిచేలా ప్రధాని మాట్లాడటం సిగ్గు చేటని ఆవేదన వ్యక్తంచేశారు.