నేరేడుచర్ల( జనం సాక్షి)న్యూస్:-
మండల పరిధిలోని కమలా నగర్ మరియు పాత నేరేడుచర్ల సరిహద్దులో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ డంపింగ్ యార్డును తొలగించాలని మున్సిపల్ కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్లు కి మంగళవారం ఆ గ్రామ ప్రజలు వినతి పత్రం అందించారు.నిత్యం యార్డు నుంచి వెలువడే దుర్వాసనలు,చెత్తను కాల్చడంతో మంటతో పాటు పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారుని,
డంపింగ్ యార్డులోని చెత్త వల్ల ప్రజలు అనారోగ్యాల బారినపడుతున్నారని,సమస్య తీవ్రతను గుర్తించి అక్కడినుంచి తరలించాలని వినతి పత్రంలో పేర్కోన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు వెంకట రెడ్డి,మట్టా రెడ్డి,సునీల్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.